జీవనయానం [Jeevanayanam]

  1. home
  2. Books
  3. జీవనయానం [Jeevanayanam]

జీవనయానం [Jeevanayanam]

3.50 2 0
Share:

ఖమ్మం జిల్లా చిట్టిగూడూరులో నిజాం పరిపాలన కాలంలో...

Also Available in:

  • Amazon
  • Audible
  • Barnes & Noble
  • AbeBooks
  • Kobo

More Details

ఖమ్మం జిల్లా చిట్టిగూడూరులో నిజాం పరిపాలన కాలంలో సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో జన్మించిన రంగాచార్యుల జీవితంలో పలు వైవిధ్యాలు, వైరుధ్యాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ జీవనయానంలో అక్షరీకరించారు. చిన్నతనంలో నిజాం రాజ్య స్థితిగతులు, అనంతరం తండ్రితో విభేదాలు, ఆయనకు దూరంగా అన్న కృష్ణమాచార్యులు, తల్లితో వేరు కాపురం, అన్నగారు జైలు పాలవడంతో చిన్నవయసులోనే ఉద్యోగం చేసి బాధ్యతలు స్వీకరించడం వంటి అంశాలతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది.

ఆపై ఉద్యోగం చేస్తూనే నైజాం రాజకీయ, సాంఘిక వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, అందుకు నాటి నిజాం ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదుర్కోవడం, పల్లె మొత్తం రంగాచార్యను పోషించిన అపురూప ఘటన, ఆపై పూర్తిస్థాయి ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ దళంలో చేరడం, సాయుధంగా పోరాడుతూ మృత్యువు నుంచి తప్పించుకుని పోలీసుచర్య ద్వారా భారతదేశంలో విలీనం కావడం మరొక దశ.

భారతదేశంలో భాగమయ్యాకా ఆయనకు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం రావడం, ఆళ్వారుస్వామి వదిలివెళ్లిన తెలంగాణ పోరాట క్రమాన్ని చిత్రించే నవలల రచన ప్రణాళిక స్వీకరించడం, కుటుంబంలో సమస్యలు, అవి సర్దుకోవడం, అనారోగ్యం, చివరిదశలో అపురూపమైన సత్కారాలు వంటివి చివరి దశలో చిత్రీకరించారు.

  • Format:Paperback
  • Pages:508 pages
  • Publication:1999
  • Publisher:Vishalandra
  • Edition:
  • Language:tel
  • ISBN10:
  • ISBN13:
  • kindle Asin:B0DM2B8TLB

About Author

Dasaradhi Rangacharya

Dasaradhi Rangacharya

4.13 107 25
View All Books